ప్రజల గొంతుక కె.నాగేశ్వర్ ను మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించండి

నమస్తే శేరిలింగంపల్లి: ఉమ్మడి హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ మద్దతు తెలపాలని కోరుతూ నాగేశ్వర్ టీం కార్యకర్తలు శుక్రవారం శేరిలింగంపల్లి లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. అనంతరం టీమ్ నాగేశ్వర్ కార్యకర్తలు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ అందర్నీ చైతన్య పరుస్తూ విశ్లేషణ చేసే మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్ ని పెద్దల సభకు గెలిపించి పంపాల్సిన అవసరం ఉందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో టీం నాగేశ్వర్ కార్యకర్తలు యాదయ్య,  లక్ష్మారెడ్డి, మాణిక్యం, బి. సాయిలు, బి .వెంకటేశ్వర్లు, వెంకటరాజ్యం, శ్రీనివాస రావు, ఏం. అడివయ్య, కె. రాజయ్య, పగడాల లక్ష్మయ్య, సోమయ్య, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీం నాగేశ్వర్ కార్యకర్తలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here