ఆస్తి పన్ను బకాయిలను పూర్తి స్థాయిలో వసూలు చేయాలి: డిసి సుధాంష్

ఆస్తి పన్ను విభాగపు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న డిసి సుధాంష్

చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ పరిధిలో ప్రస్తుత  ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన ఆస్తిపన్ను వసూలు  ప్రక్రియలో వందశాతం ఫలితాలు సాధించాలని సర్కిల్ ఉప కమిషనర్  సుధాంశు నందగిరి అన్నారు. గురువారం సర్కిల్ కార్యాలయంలో టాక్స్ ఇన్స్పెక్టర్లు, ఏ ఎమ్ సి లు, బీసీల తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాంశు మాట్లాడుతూ 2019 20 ఆర్థిక సంవత్సరంలో చందానగర్ సర్కిల్ పరిధిలో 59 పాయింట్ 3 కోట్ల రూపాయలు ఆస్తిపన్ను వసూలు చేయగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 83 కోట్ల రూపాయలు లక్ష్యం నిర్దేశింపబడింది అని తెలిపారు. జనవరి 27వ తేదీ నాటికి   63 కోట్ల 72 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగిందని మరో 4 కోట్ల  42 లక్షలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఆస్తి పన్ను విభాగపు అధికారులు గడువులోగా పూర్తి బకాయిలను వసూలు చేయాలని ఆదేశించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here