నాలా విస్తరణ పనుల‌ను వేగవంతం చేయాలి: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

మియాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ లోని త‌న‌ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మంగ‌ళ‌వారం శేరిలింగంపల్లి సర్కిల్, చందానగర్ సర్కిల్, కూకట్‌ప‌ల్లి సర్కిల్ ల‌లోని నాలాల అభివృద్ధి, పురోగతిపై జోనల్ కమిషనర్ రవి కిరణ్, చీఫ్ ఇంజనీర్ వసంత, ఇరిగేషన్, రెవెన్యూశాఖ, టౌన్ ప్లానింగ్, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు.

కార్పొరేట‌ర్లు, అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. నాలా విస్తరణ పనుల‌ను వేగవంతం చేయాలన్నారు. వరద నీరు ప్రవహించే ప్రదేశాలలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని అన్నారు. పనుల‌ను త్వరితగతిన పూర్తి చేయాల‌ని అన్నారు. ఈ మధ్య కురిసిన వర్షాలతో చెరువుల మధ్యలో ఉన్న నాలాల ద్వారా ఒక చెరువు నుండి మరొక చెరువుకు నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అవరోధాలు లేకుండా నాలాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికల‌ను రూపొందించాల‌న్నారు.

ఎన్నో రోజుల నుండి చేపడుతున్న అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాల‌ని, దీప్తి శ్రీ నగర్ నాలా విస్తరణలో భాగంగా సీబీఆర్‌ ఎస్టేట్స్ వద్ద అసంపూర్తిగా మిగిలిపోయిన రక్షణ ప్రహరీ గోడ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, జనప్రియ నాలా పనులు పూర్తయ్యేలా చూడాలని, పీజేఆర్‌ రోడ్డు కల్వర్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అన్నారు. నాలా విస్తరణ పనుల‌ను పూర్తి స్థాయిలో చేపట్టడం ద్వారా ఎన్నో ఏళ్లుగా నెలకొన్న సమస్యల‌కు శాశ్వత పరిష్కారం ల‌భిస్తుంద‌న్నారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస రావు, జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, సాయి బాబా, దొడ్ల వెంకటేష్ గౌడ్, హమీద్ పటేల్, సింధు ఆదర్శ్ రెడ్డి, పూజిత జగదీశ్వర్ గౌడ్, మాధవరం రోజాదేవి రంగారావు, రెడ్డి మంజుల రఘునాథ్ రెడ్డి, సీఈలు వసంత, రమణ, సీపీ శ్రీనివాస రావు, ఏసీపీలు వేణు, సంపత్, ఏస్ఈ శంకర్, డీఈ లు శ్రీనివాస్, రమేష్, శ్రీరాములు, సత్యనారాయణ, సురేష్ కుమార్, రూపా దేవి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మహిపాల్ రెడ్డి, ఏఈ లు శేషగిరి రావు, రవీందర్, శ్రీనివాస్, శేఖర్ రావు, సునీల్ కుమార్, శివ కృష్ణ, రమేష్, అనురాగ్, ప్రశాంత్, సుభాష్, శివ ప్రకాష్, రాజీవ్, స్వప్న పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here