రామ మందిర నిర్మాణంలో అంద‌రూ భాగ‌స్వాములు కావాలి: రవి కుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అయోధ్య‌లో భ‌వ్య రామ మందిర నిర్మాణంలో అంద‌రూ భాగ‌స్వాములు కావాల‌ని శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకుడు రవి కుమార్ యాదవ్ అన్నారు. మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీ, జనప్రియ వెస్ట్ సిటీల‌ నుంచి పెద్ద ఎత్తున రాజస్థాన్ మార్వాడీలు నాయ‌కుడు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు. ర‌వికుమార్ యాద‌వ్ వారికి పార్టీ కండువాలు క‌ప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.

బీజేపీలో చేరిన వారితో ర‌వికుమార్ యాద‌వ్, గుండె గణేష్ ముదిరాజ్

అనంత‌రం రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ బిజెపిలో నాయ‌కులు చేరినందుకు సంతోషంగా ఉంద‌న్నారు. వారికి ఎల్లవేళలా త‌న మ‌ద్ద‌తు తప్పకుండా ఉంటుందని తెలియజేశారు. అయోధ్య‌లో రామ మందిర‌ నిర్మాణంలో అంద‌రూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా హిందూ భావం కలిగిన వారందరూ ఈ మందిర నిర్మాణానికి త‌మ‌ వంతు సహాయంగా విరాళాలు ఇవ్వాల‌ని కోరారు. పార్టీలో చేరిన వారిలో నారాయణ, సురేష్, నవాబ్, అనుపు, మాడల్ లోయల్‌, సునీల్ బిషోనీ, ప్రేమ్ జీషోనీ, రాజేందర్ వర్మ ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి నాయకులు మల్లేష్, సార రవీందర్, జాజి రావు, శ్రీను, కొంచె శివరాజ్ ముదిరాజ్, కొంచె బాబు ముదిరాజ్, జాజి రావు, రాము, చంద్రమాసి రెడ్డి, వినోద్ యాదవ్, సోను కుమార్ యాదవ్, శివ రమేష్, నరేష్ చారి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here