నల్లగండ్లలో మహిళ దారుణ హత్య… కత్తితో గొంతు కోసిన ఆటోడ్రైవర్…

  • అక్రమ సంబంధమే హత్యకు కారణమం..?
  • పోలీసుల అదుపులో హంతకుడు ఆటో డ్రైవర్ భరత్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఘటన నల్లగండ్ల లక్ష్మి విహార్ ఫేస్ 1 లో చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక సేడం ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి(32) అనే మహిళ తన భర్త, పదేళ్ల కుమారుడితో కలసి లక్ష్మీ విహార్ ఫేజ్ 1లో నివాసం ఉంటుంది. స్థానిక అపర్ణ టవర్స్ లో వంటమనిషిగా పనిచేస్తుంది. భర్త కూలి పనులు చేస్తుంటు జీవనం సాగిస్తున్నారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం విజయలక్ష్మి దారుణ హత్యకు గురైంది. ఓ దుండగుడు కత్తితో ఆమె గొంతు కోసి హతమార్చాడు.

రక్తపు మడుగులో పడి ఉన్న విజయ లక్ష్మి

అనంతరం నిందితుడు చందానగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధమే మహిళ హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలింది. కాగా ఘటన స్థలికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో పడింది.

ఆటోడ్రైవర్ భరత్ అలియాస్ శ్రీనివాస్ గౌడ్

ఐతే నిందితుడు లింగంపల్లికి చెందిన ఆటోడ్రైవర్ భరత్ అలియాస్ శ్రీనివాస్ గౌడ్ గా గుర్తించారు. ఐతే ఈ భరత్ గౌడ్ ఫైనాన్స్ కూడ నడిపిస్తుంటాడు. ఈ క్రమంలోనే మృతురాలు విజయలక్ష్మీ తమ్ముడు సునిల్ ఆటో కోనేందుకు గతంలో ఫైనాన్స్ ఇచ్చాడు. ఆ డబ్బుల విషయంలోనే ఇటీవల కొల్లూరు పోలీస్ స్టేషన్ లో భరత్ గౌడ్ కేసుపెట్టాడు. తర్వాత వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుకోని వారం క్రితమే కోర్టులో కేసు విత్ డ్రా చేసుకుంటానని హామి ఇచ్చినట్టు తెలుస్తుంది. అదలా ఉంచితే భరత్ గౌడ్ ఈరోజు విజయలక్ష్మిని నరికి చంపాడు. ఆమెను అంత దారుణంగా ఎందుకు హతమార్చాడు అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు.

మృతురాలు విజయలక్ష్మీ(ఫైల్)

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here