మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 2వ తేదీన ఉదయం 8 గంటల సమయంలో మియాపూర్‌లోని కల్లు కాంపౌండ్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఆ వ్యక్తి విపరీతంగా కల్లు సేవించి ఉంటాడని, దీంతో ఫిట్స్ వచ్చి చనిపోయి ఉంటాడని పోలీసులు తెలిపారు. అతని వివరాలు తెలియలేదని వారు పేర్కొన్నారు.