గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తారానగర్ ఏఈ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. గచ్చిబౌలి సబ్స్టేషన్ నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సుదర్శన్ నగర్, డోయెన్స్ కాలనీ, ఆలింద్ హౌసింగ్ సొసైటీ, గుల్మోహర్ పార్క్, హెచ్సీయూ డిపో, లెజెండ్ పార్క్, ఆదర్శ్ నగర్, నేతాజీనగర్, గోపీ నగర్, ఆదర్శ్ నగర్ ప్రాంతాల్లో కరెంటు ఉండదని తెలిపారు.