గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా వేమగిరి ప్రాంతానికి చెందిన కొత్తూరి వెంకట్ రావు (27) గచ్చిబౌలిలోని ఏపీహెచ్‌బీ కాలనీలో ఉన్న అమూల్య హాస్టల్‌లో ఉంటూ స్థానికంగా ఓ ఇరిగేషన్ ప్రాజెక్టులో సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా మంగళవారం ఉదయం 11.26 గంటల సమయంలో అతను తన తండ్రికి I have taken hard decision in life అని మెసేజ్ పెట్టాడు. దీంతో వెంకట్ రావు తండ్రి కె.సాయిబాబు అతనికి ఫోన్ కాల్ చేయగా స్పందించలేదు. అనంతరం తన స్నేహితుడు సత్యవాడ నాగ బాబుకు వెంకట్ రావు ఫోన్ కాల్ చేసి విషయం చెప్పాడు. దీంతో నాగబాబు 12 గంటలకు వెంకట్ రావు ఉంటున్న హాస్టల్ రూమ్‌కు వచ్చాడు. అయితే డోర్ లోపలి నుంచి లాక్ చేసి ఉండడంతో నాగబాబు హాస్టల్ వ్యక్తుల సహాయంతో డోర్‌ను ఓపెన్ చేశాడు. కాగా అప్పటికే వెంకట్ రావు సీలింగ్ ఫ్యాన్‌కు బెడ్ షీటుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో వెంకట్ రావు తండ్రి సాయిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకట్ రావు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

