తాబేళ్ల‌ను అక్ర‌మంగా విక్ర‌యిస్తున్న వ్య‌క్తి అరెస్టు

శేరిలింగంప‌ల్లి, మార్చి 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అక్ర‌మంగా తాబేళ్ల‌ను విక్ర‌యించేందుకు య‌త్నిస్తున్న ఓ వ్య‌క్తిని చందాన‌గ‌ర్ పోలీసులు అరెస్టు చేసి అత‌న్ని అట‌వీ శాఖ అధికారుల‌కు అప్ప‌గించారు. అత‌ని నుంచి 4 తాబేళ్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం చందాన‌గ‌ర్‌లోని గౌత‌మిన‌గ‌ర్‌లో నివాసం ఉంటున్న ఆవాజ్ (24) అమెరికా, మెక్సికో జాతికి చెందిన తాబేళ్ల‌ను విక్ర‌యించేందుకు య‌త్నిస్తున్నాడ‌న్న స‌మాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. అత‌ని నుంచి 4 తాబేళ్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం తాబేళ్ల‌తో స‌హా అత‌న్ని అట‌వీ శాఖ అధికారుల‌కు అప్ప‌గించగా వారు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here