శేరిలింగంపల్లి, మార్చి 30 (నమస్తే శేరిలింగంపల్లి): సురభి కళాక్షేత్రం ఆధ్వర్యంలో థియేటర్ ఫెస్టివల్‌లో భాగంగా శేరిలింగంపల్లిలోని ఆలిండ్ ఎంప్లాయీస్ కాలనీ సుప్రీం ట్రాంపోలిన్ పార్క్ సమీపంలో రంగభూమి స్పేసెస్‌లో నాటికలను ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 31, 2026 మంగళవారం రాత్రి రెండు నాటికలను వెంట వెంటనే ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 6:30 గంటలకు డాక్టర్ ఎస్.రమేష్ దర్శకత్వంలో నెల్లుట్ల రమాదేవి రచించిన మీడియా మేనియా నాటికను ప్రదర్శించనున్నామని, అనంతరం రాత్రి 7:30 గంటలకు తనికెళ్ల భరణి రచించిన గోగ్రహణం నాటికను ప్రదర్శిస్తామని తెలిపారు. ఈ నాటికలకు ప్రవేశ రుసుము కేవలం రూ.200 మాత్రమేనని, నాటికల ప్రదర్శన సమయంలో స్నాక్స్, కూల్ డ్రింక్స్‌ను ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు. మరిన్ని వివరాలకు 94904 23885, 63094 13885 ఫోన్ నంబర్లలో లేదా surabhikalakshetram@gmail.com అనే ఈ-మెయిల్ ఐడీలోనూ సంప్రదించవచ్చని పేర్కొన్నారు.






