బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం : బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచందర్ ని బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ బంజారాహిల్స్ లోని బీసీవై పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీలు వెనకబడి ఉన్నారని అందుకు అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ అమలయింతవరకు అంద‌రూ కలిసి పోరాడ వలసిన బాధ్యత ఎంతైనా ఉందని ఆయన అన్నారు. బిసి ప్రజలను ఐక్యం చేసి నాయకత్వ లక్షణాలను పెంపొందింప చేసి బీసీల హక్కుల కోసం బీసీల రాజ్యాధికారం కోసం పోరాడేలా సైనికులను తయారు చేసుకోవాలని అన్నారు. అత్యధిక జనాభా ఉన్న బీసీలు ఈ తరం వరకు కూడా వెనుకబడే ఉన్నార‌ని రాబోయే తరాల వారికైనా హక్కులను సాధించి పెట్టాలని అందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని అన్నారు . ఈ కార్య‌క్ర‌మంలో వికారాబాద్ జిల్లా కన్వీనర్ శంకర్ యాదవ్, వికారాబాద్ నియోజకవర్గ కన్వీనర్ శ్రీశైలం యాదవ్, మేడ్చల్ జిల్లా యాదవ సంఘం నాయకుడు రాజశేఖర్ యాదవ్, పద్మశాలి సంఘం కన్వీనర్ రాజేందర్ నేత, ముదిరాజ్ సంఘం శ్రీశైలం, వికారాబాద్ మండల కన్వీనర్ యాదగిరి యాదవ్ ,మండల కన్వీనర్ సుధాకర్ యాదవ్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here