శేరిలింగంపల్లి, నవంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం చందానగర్ పోలీసులకు లభ్యమైంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వయస్సు సుమారుగా 45 ఏళ్లు ఉంటుందని, పరిసర ప్రాంతాల్లో యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడని, బహుశా ఆహారం లేకపోవడం వల్ల అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా గుర్తు పట్ట దలిస్తే తమను సంప్రదించాలని సూచించారు.






