శేరిలింగంపల్లి, నవంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో కన్‌జ్యూమర్ డే వేడుకలను నిర్వహిస్తున్నట్లు హైదర్‌నగర్ ఏఈ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో వినియోగదారులు తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఇందుకు గాను విద్యుత్ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు.





