నమస్తే శేరిలింగంపల్లి: బ్యుటీషియన్ గా పనిచేస్తున్న భార్య తన భర్తతో ఉన్న విభేదాలతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం మాదాపూర్ లోని విఠల్ రావు నగర్ అలియన్స్ బ్లెండ్ అపార్ట్‌మెంట్ లో డార్జిలింగ్ కు చెందిన ఓంగ్మిట్ లెప్చా W/o మదన్ ప్రధాన్ బ్యుటీషియన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. తన భర్త మదన్ ప్రధాన్ తో ఉన్న విభేదాల వల్ల గత రెండేళ్లుగా దూరంగా ఉంటోంది. భర్తతో విభేదాలతో మనస్తాపం చెందిన ఓంగ్మిట్ లెప్చా శనివారం తాను నివాసం ఉంటున్న అలియన్స్ బ్లెండ్ అపార్ట్ మెంట్ లో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి వయస్సు 16 సంవత్సరాలు, రెండేళ్ల వయస్సు గల ఒక బాబు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.