నమస్తే శేరిలింగంపల్లి: దశల వారీగా సమస్యలను పరిష్కరించి కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతామని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని దూబే కాలనీలో శనివారం స్థానికులతో కలిసి పర్యటించారు. కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దూబే కాలనీలో డ్రైనేజీ సమస్య తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆదేశించారు. ఆయన వెంట ఏఈ సునిల్, టీఆర్ఎస్ శేరిలింగంపల్లి డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, నాయకులు లక్ష్మణ్ యాదవ్, సాయి, శ్యామ్, జమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.