లారీ ఢీకొని గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృతి

మియాపూర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): లారీ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బ‌లి తీసుకుంది. అత్యంత నిర్ల‌క్ష్యంగా వేగంగా లారీని న‌డిపించి ఓ వ్య‌క్తిని ఢీకొన‌గా ఆ ప్రమాదంలో ఆ వ్య‌క్తి తీవ్ర‌గాయాల‌కు గురై అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. మియాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 24వ తేదీన రాత్రి 9.00 గంట‌ల స‌మ‌యంలో MH46H0195 అనే నంబ‌ర్ ఉన్న ఓ లారీ చందాన‌గ‌ర్ నుంచి కూక‌ట్‌ప‌ల్లి వైపుకు వ‌స్తోంది. మార్గ‌మ‌ధ్య‌లో ఆల్విన్ కాల‌నీ ఎక్స్ రోడ్డు వ‌ద్ద ఓ వ్య‌క్తి రోడ్డు దాటుతున్నాడు. అదే స‌మ‌యంలో అటుగా వచ్చిన లారీ ఆ వ్య‌క్తిని ఢీకొట్టింది. దీంతో ఆ వ్య‌క్తి తీవ్ర గాయాల‌కు గురై అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. ఆ స‌మ‌యంలో అక్క‌డ విధులు నిర్వ‌ర్తిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మోహ‌న్ నాయ‌క్ స‌మాచారం మేర‌కు పోలీసులు ఆ వ్య‌క్తి మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి స‌ద‌రు లారీ డ్రైవ‌ర్‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. లారీ డ్రైవ‌ర్ లారీని వేగంగా నిర్ల‌క్ష్యంగా న‌డిపించ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని పోలీసులు తెలిపారు. కాగా చ‌నిపోయిన వ్య‌క్తి వివ‌రాలు తెలియ‌వ‌ని, అత‌ని వ‌య‌స్సు బ‌హుశా 35 నుంచి 38 ఏళ్ల మ‌ధ్య ఉంటుంద‌ని, న‌లుపు రంగు టీ ష‌ర్ట్‌, బ్లూ క‌ల‌ర్ ప్యాంట్ ధ‌రించి ఉన్నాడ‌ని, ఎవ‌రైనా గుర్తు ప‌ట్ట‌ద‌లిస్తే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని మియాపూర్ పోలీసులు తెలిపారు.

గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here