వ్యాపారం పేరుతో మోసం చేసిన భార్యభర్తలిద్దరూ అరెస్టు

నమస్తే శేరిలింగంపల్లి: వ్యాపారం పేరుతో ఆయా వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో తీసుకుని మోసం చేసిన భార్యభర్తలిద్దరూ‌ జైలు పాలైన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళకు చెందిన పెరుబద్రకలం సహదేవన్ సబిత, ఎ.పి. రంగనాథన్ భార్తభర్తలిద్దరూ ట్రేడింగ్ పేరుతో పలువురు వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. తిరిగి డబ్బులు ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితులు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. సబిత, రంగనాథన్ ను గురువారం అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. తీసుకున్న డబ్బులను ఎక్కడెక్కడ ఖర్చు చేశారనే విషయాలు తదుపరి విచారణలో తేలనున్నట్లు చెప్పారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here