నమస్తే శేరిలింగంపల్లి: క్యాన్సర్ మహమ్మారి ప్రాణాంతక వ్యాధి అని, క్యాన్సర్ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కలిగి ఉండాలని, క్యాన్సర్ పై పోరాటాన్ని వేగవంతం చేయడానికి మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కాన్సర్ పేషెంట్స్ కి యోగా థెరపీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ జూలూరి అన్నారు. క్యాన్సర్ వ్యాధి నివారణపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించేలా క్లోజ్ ది కేర్ గ్యాప్ సందేశంతో యోగా థెరపీ ని మెడికవర్ ఆస్పత్రిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారితో ఒకరిని కోల్పోవడం బాధాకరమని, క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించి చికిత్స తీసుకోవడంతో ప్రాణాలను దక్కించుకోవచ్చన్నారు. యోగా థెరపీతో జీవనశైలిలో మార్పు, ఆరోగ్య పరంగా ఎంతో దోహద పడుతుందన్నారు. యువత దూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని రేడియేషన్ ఆంకాలజిస్టు డాక్టర్ వినోద్ అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాద్విక్ రఘురాం, సిబ్బంది, సెంటర్ హెడ్ స్వప్నిల్ రాయ్, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.