పార్టీ సభ్యత్వ నమోదును జయప్రదం చేయండి – వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ‌ కార్యకర్త నడుం బిగించి పనిచేయాలని, పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదును విజయవంతం చేయాల్సిన అవసరం ‌ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న డీసీసీ ‌అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, తదితరులు

ఈ సందర్భంగా వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి బూత్ స్థాయిలో వంద మంది సభ్యత్వం తప్పనిసరిగా చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సభ్యత్వ ఇంచార్జి కె. వినయ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైపాల్, కో ఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, ఇలియాజ్ షరీఫ్, డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, రేణుక, భరత్ గౌడ్, సురేష్, పోచయ్య, రాజేందర్,ఈశ్వర్, రాజన్, కవిరాజ్, ఖాజ, హరి, జామీర్, కృష్ణ,‌ సందీప్, అల్లాఉద్దీన్, జావేద్ లు పాల్గొన్నారు‌.

పార్టీ సభ్యత్వాన్ని అందజేస్తున్న డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here