ద‌స‌రా సెల‌వుల‌కు వెళ్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. పోలీసుల సూచ‌న‌లు..

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ద‌సరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్న‌వారికి దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీసులు కొన్ని ముఖ్య‌మైన సూచ‌న‌లు చేశారు. ఈ మేర‌కు వారు ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ద‌సరా పండుగ సెలవులకు ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్ల లో భద్రపర్చుకోండి లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి. సెలవులలో బయటకు వెళుతున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్ ను ఏర్పాటు చేసుకోవడం మంచింది. మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్న తాళం అమర్చుకోవ‌డం మంచిది. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే మీ స్థానిక పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వండి. మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వండి లేదా డయల్ 100 కు ఫోన్ చేయండి.

మీ వాహనాలను మీ ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకొండి. మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి, మీకు వీలైతే చక్రాలకు చైన్స్ తో కూడా లాక్ వేయడం మంచిది. నమ్మకమైన వాచ్ మెన్ లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోండి. మీ ఇంట్లో అమర్చిన CC Camera లను online లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, News Paper, పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి. వాటిని కూడా గమనించి దొంగతనాలకు పాల్పడుతారు అన్న విషయాన్ని గమనించండి. మెయిన్ డోర్ కి తాళం వేసినప్పటికీ అవి కనిపించకుండా కర్టెన్స్ తో కవర్ చేయడం మంచిది. బయటకు వెళ్లేటప్పుడు ఇంటి లోపల, బయట కొన్ని లైట్లు వేసి ఉంచితే మంచిది.

మీ ఇంటి దగ్గర మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పడం మంచిది. మీ ఇంటికి వచ్చే, వెళ్ళే దారులు, ఇంటిలోపల CC Camera లు అమర్చు కొని DVR కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశం లో ఉంచండి. అల్మరా, కప్ బోర్డ్స్ కు సంబంధించిన తాళాలు కామన్ ఏరియా అయిన చెప్పుల స్టాండ్, పరుపులు, దిండ్ల క్రింద, అల్మరా పైన, డ్రెస్సింగ్ టేబుల్ లో, కప్ బొర్డ్స్ లో ఉంచకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో ఉంచడం మంచిది.

బంగారు ఆభరణాలు వేసుకొని ఫంక్షన్ లకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రతలు తీసుకోండి. సోషల్ మీడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు. కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి. మీకు ఎవరి మీదైనా అనుమానం వస్తే 100 టోల్ ఫ్రీ నెంబర్ కు గానీ, సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ 9490617100 కు లేదా, వాట్సాప్ నంబర్ 9490617444 కు dial చేయాల‌ని పోలీసులు సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here