మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మ మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్‌నగర్‌లో ని పోచమ్మ గుడిలో పనిచేసే గంగమ్మ అనే మహిళ ప్రమాదంలో గాయపడటంతో విషయం తెలుసుకున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గురువారం ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఎటువంటి సహాయం అవసరమైనా తాను అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు వెంకటేష్, మోహిన్, ప్రసన్నరెడ్డి, శ్రీనివాస్, జగదీష్, దుర్గప్రసాద్, విజయ్, దేవేందర్, సతీష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత్ నగర్‌లో పర్యటన…
మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్ కాలనీలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో జరుగుతున్న వరదనీటి కాలువల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించకుండా చూసుకోవాలని కాంట్రాక్టర్లకు సూచించారు.
