ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టిఆర్ఎస్: బిజెపి నాయకులు ఎం. రవికుమార్ యాదవ్

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతుల హ‌త్య‌ను నిరసిస్తూ వివేకానంద‌న‌గ‌ర్ డివిజన్ బిజెపి ఇంచార్జి ఉప్పల విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం వివేకానంద నగర్ కమాన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బిజెపి నాయకులు ఎం. రవి కుమార్ యాదవ్ గారు హాజరై మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోఅరాచకాన్ని సృష్టిస్తున్న టిఆర్ఎస్ గుండాల ఆగడాల కి త్వరలో తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌న్నారు. వామనరావు దంపతులను హత్య చేసిన మండల టిఆర్ఎస్ నాయకుడు” కుంట శ్రీను” ని వెంటనే అరెస్టు చేయాలని, ఈ అరాచకాలను ప్రోత్సహించిన‌ట్లు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నామాల శ్రీనివాస్, నాయ‌కులు వడ్డేపల్లి రంగారావు, శంకర్, గణేష్ గౌడ్, సంతోష్, పిట్టల శ్రీను, భాను యాదవ్, తిమ్మయ్య, కళ్యాణ్, వీర్రాజు గౌడ్, జితేందర్, నాగరాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు న్యాయ‌వాదుల హ‌త్య‌పై ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న తెలుపుతున్న రవికుమార్‌యాద‌వ్‌, ఉప్ప‌ల క‌ల్ప‌న ఏకాంత్‌గౌడ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here