నమస్తే శేరిలింగంపల్లి : కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ… కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భారీ బహిరంగా సభకు శేరిలింగంపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సమక్షంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్లు, బస్తీ కమిటీ మెంబర్లు, బస్తీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, యువ నాయకులు, మహిళా నాయకురాళ్లు గచ్చిబౌలి ఓఆర్ఆర్ వద్ద శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి బస్సులలో బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, వార్డ్ మెంబర్ రాంబాబు, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు పురం విష్ణు వర్ధన్ రెడ్డి, గోపాల్ యాదవ్, గడ్డం రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, సుభాష్ రాథోడ్, జమ్మయ్య, సురేష్ పాల్గొన్నారు.