ఛలో నల్లగొండ సభను విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

  • ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు

నమస్తే శేరిలింగంపల్లి : కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ… కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భారీ బహిరంగా సభ నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా నల్గొండ బహిరంగ సభ కు కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, జూపల్లి సత్యనారాయణ, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగరావు, సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీతో బయలుదేరారు.

ఎమ్మెల్యే గాంధీ ఆధ్వర్యంలో నల్లగొండ భారీ బహిరంగ సభకు తరలిన బీఆర్ఎస్ శేరిలింగంపల్లి కార్పొరేటర్లు, నాయకుల బృందం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల ప్రయోజనాలను గండి కొట్టే విధంగా కృష్ణా నది మీద ఉన్న సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేంద్రానికి దారాదత్తం చేస్తూ తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా చేపడుతున్న భారీ బహిరంగ సభకు భారీ వాహన శ్రేణితో బయలుదేరినట్లు చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు.. ఎంతకైనా ఈ గర్జనకు లక్షలాదిగా తరలి రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here