- గీతాంజలి హై స్కూల్ లో ఘనంగా స్పొర్ట్స్ మీట్
- గచ్చి బౌలి ఇండొర్ స్టేడియంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నమస్తే శేరిలింగంపల్లి : గచ్చి బౌలి ఇండొర్ స్టేడియంలో గీతాంజలి హై స్కూల్ నిర్వహించిన స్పొర్ట్స్ మీట్ ఆద్యంతం ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సినీ నటుడు సుమన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చదువడం వరకే పరిమితం కాకుండా ఆటల పట్ల కూడా విద్యార్థులను తీర్చిదిద్దడంపై గీతాంజలి స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. చదువుతోపాటు ఆటల్లోనూ విద్యార్థులను ప్రొత్సహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ రెష్మ టకూన్, ఆజాద్ ఫౌండేషన్ వ్యవస్తాపకులు, స్కూల్ అద్యాపకులు, విద్యార్దుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.