మార్తాండ‌న‌గ‌ర్‌లో సీసీ రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలించిన కార్పొరేట‌ర్ హ‌మీద్‌ప‌టేల్‌

మార్తాండ న‌గ‌ర్‌లో కొన‌సాగుత‌న్న సీసీ రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్

కొండాపూర్‌(న‌మ‌స్తే తెలంగాణ‌): కొండాపూర్ డివిజన్ పరిధిలో మౌలిక వసతులు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. ఆదివారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ లో రూ. 36 లక్షలు అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న‌ అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక నాయకులు, కాలనీ వాసులుతో కలసి ఆయ‌న పరిశీలించారు. కాలనీలోని ఇళ్ల సమాంతర స్థాయి బట్టి రోడ్లను వెయ్యాలని, రోడ్ల ఎత్తు పెంచితే వర్షా కాలంలో నీరు ఇళ్లలోకి చేరి ఇబ్బందులు ఎదురవుతాయని, తగిన జాగ్రత్తలు తీసుకోని రోడ్లను వెయ్యాలని, నాణ్యత ప్రమాణాలను పాటించాలని కార్పొరేటర్ హమీద్ పటేల్ సూచించారు. కొండాపూర్ డివిజన్ లోని సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలియజేశారు. కొన్ని చోట్ల ఉన్న డ్రైనేజీ, ఓపెన్ నాలా సమస్యలు పరిష్కరించటానికి అన్ని విధాల చర్యలు తీసుకోవటం జరుగుతుందని, డివిజన్ లోని అభివృద్ధికి స్థానిక నాయకులు, ప్రజల సహకారం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్ర‌మంలో వార్డుమెంబర్ శ్రీనివాస్ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ గఫుర్, ఏరియా కమిటీ మెంబర్ తాడెం మహేందర్, తెరాస సీనియర్ నాయకులు మహ్మద్ అలీ, సమద్, ప్రవీణ్, రజనీకాంత్, యూత్ నాయకులు దీపక్, సాగర్, హుస్సేన్ భాషా, లక్ష్మణ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్‌కు స్థానిక స‌మ‌స్య‌ల‌ను వివ‌రిస్తున్న మార్తాండ‌న‌గ‌ర్ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here