ఆరు గ్యారెంటీలలో అన్ని అమలయ్యేలా చూడండి

  • సమీక్షా సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : ప్రజాపాలన ద్వారా వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని త్వరితగతిన అమలు జరిగేలా చూడాలని, ఆరు గ్యారంటీలలో అన్ని అమలయ్యేలా చూడాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ. కొంగర కలన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సమీక్షా సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కలెక్టర్ గౌతమ్, జడ్పీ చైర్మన్లు అనిత, పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, సుధీర్ రెడ్డి, కాలే యాదయ్య, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని పలు సమస్యలను మంత్రికి తెలిపారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలనపై సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సుధీర్ బాబు

మహాలక్ష్మి పథకం (గ్యాస్ సిలిండర్ – 500, 2500 నగదు) గృహజ్యోతి (200 యూనిట్ల కరెంట్ రాయితీ) ఇందిరమ్మ ఇల్లు, చేయూత (ఫించన్లు) వంటి పథకాలకు సంబంధించి వస్తున్న వినతులను పరిగణలోకి తీసుకుని పేద, మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని, నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలని కోరారు.

సమావేశంలో ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, సుధీర్ రెడ్డి, కాలే యాదయ్య, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు తదితరులు

ప్రజాపాలన ద్వారా వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని త్వరితగతిన అమలు జరిగేలా చూడాలని, ఆరు గ్యారంటీల అమలులో భాగంగా కొన్ని కార్యక్రమాలే చేపడుతున్నారని, మిగతావి అమలయ్యేలా చూడాలని, రేషన్ కార్డ్ తప్పనిసరి అంటున్నారని, మ్యానిఫెస్టోలో ప్రతి మహిళకి మహాలక్ష్మి పథకం అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు రేషన్ కార్డ్ తప్పని సరి చేశారని, రేషన్ కార్డ్ లేని వారికి ప్రయోజనం ఏ విధంగా చేకూరుతుందని ఆయన దృష్టికి తెచ్చారు. ఆసరా పింఛన్లు, రేషన్ కార్డ్ ల కోసం ఇది వరకే వినతి పత్రాలు ఇచ్చారని, ఆన్లైన్ లో అప్లై చేసుకొని ఉన్నారని, వారి సమాచారం తసీల్ధార్, కలెక్టర్ కార్యాలయాలలో ఉన్నాయని, వాటిని పరిగణలోకి తీసుకోవాలని మంత్రికి విన్నవించారు. పేద ప్రజల సంక్షేమం కోసం మంచి జరిగితే స్వాగతిస్తామని, పేద ప్రజల సంక్షేమంను విస్మరిస్తే ప్రజా గొంతు కై నిలదీస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here