శేరిలింగంపల్లి( నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో జలమండలి అధికారులు ప్రజలకు క్లోరిన్ మాత్రలను పంపిణీ చేశారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ లో జలమండలి అధికారులు మేనేజర్ వెంకట్ రెడ్డి, సూపర్వైజర్ లు ప్రవీణ్, రాజు లైన్మెన్ సంతోష్ కాలనీ అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ తో కలిసి ఇంటింటికి వెళ్లి క్లోరిన్ టాబ్లెట్లు పంపిణీ చేశారు. వరద నీటితో ఇండ్లలో నిల్వ ఉంచిన నీరు కలుషితం అవుతుందని క్లోరిన్ మాత్రలు ఉపయోగించి నీటిని శుద్ధి చేసుకోవాలని అధికారులు స్థానిక ప్రజలకు సూచించారు. క్లోరిన్ మాత్రల పంపిణీపై అసోసియేషన్ అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ జలమండలి అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు