శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): పేద వారికి చేయూత నివ్వాలనే ఉద్దేశ్యంతో హోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని శేరిలింగంపల్లి శాసనసభ్యులు గాంధీ అన్నారు శుక్రవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డికాలనీ కి చెందిన సంజయ్ కు హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5000 రూపాయల ఆర్థిక సహాయన్ని ఆరేకపూడి గాంధీ చేతుల మీదుగా సంస్థ చైర్మన్ కొండా విజయ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ సమాజము కోసం ఎదో చేయాలనే తపన వలన సమాజ హితం సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరు అవసరంలో ఉన్న తోటివారికి చేయూతనందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్,హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు గౌతమ్ గౌడ్ నాయకులు వాలా హరీష్, లక్ష్మారెడ్డి,ప్రసాద్, గోపాల్,మిరియాల ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు.