నగర వాసుల ముందుకు మరో ఎన్నికలు… ఓటరు లిస్ట్ లో మీ పేరు చెక్ చేసుకోండి…

నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో నిత్యం ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. హైదరాబాద్ నగరం లో జిహెచ్ఎంసి ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. మరో రెండు రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల వేడి చల్లారే లోగా నగర వాసులు ముందుకు మరో ఎన్నికలు రాబోతున్నాయి .(మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్) పట్టభద్రుల ఎమ్మెల్సీ గా ఉన్న ఎన్ రామచంద్ర రావుతో పాటు (వరంగల్, ఖమ్మం, నల్గొండ) పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవీ కాలం 2021 మార్చ్ తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారికి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయగా గత అక్టోబరు 1 వ తేదీన పట్టభద్రుల ఓటరు నమోదుకు అధికారులు ప్రకటన విడుదల చేసారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ నవంబరు 6 వ తేదీ వరకు కొనసాగగా 25 వ తేదీన ఓటర్ల జాబితా సిద్ధమైంది. ఈ జాబితాను డిసెంబర్ 1 వ తేదీ నుండి అందరికీ అందుబాటులో ఉంచిన ఎన్నికల సంఘం జాబితాలో మార్పులు, అభ్యంతరాలపై దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31 వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ అనంతరం జరిగిన సవరణలతో తుది ఓటర్ల జాబితా జనవరి 18 లోగ సిద్ధం కానుంది. మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.

మీ పట్టభద్రుల ఓటు చెక్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

అయితే ప్రస్తుతం కొత్తగా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం లేదు. ఇది వరకే ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్న పట్టాభద్రులు వారి వారి ఓట్ల వివరాలను క్రింది లింకులో చెక్ చేసుకోవచ్చు. ఓటరు నమోదులో ఏవైనా సవరణలు అవసరమైతే ఈ నెలాఖరులోగా దరఖాస్తు/ పిర్యాదులు చేయవచ్చు

మీ పట్టభద్రుల ఓటు చెక్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here