వైద్యులను స్మరించుకోవడం, సత్కరించుకోవడం మనందరి బాధ్యత

  • కెనరీ ద స్కూల్ లో వేడుకగా జాతీయ వైద్యుల దినోత్సవం
  • అలరించిన చిన్నారుల నాటిక , నృత్య ప్రదర్శన
  • వైద్యులకు సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి : వైద్యో నారయణో హరీ! అంటారు… అంటే వైద్యుడు దైవంతో సమానమని, ఎలాంటి విపత్తర సమయంలోనైనా ప్రజలకు నిరంతరం అండగా ఉంటున్న వైద్యుల సేవలు అనిర్వచనీయం. అలాంటి వైద్యులను స్మరించుకోవడం, సత్కరించుకోవడం మనందరి బాధ్యత … జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కెనరీ ద స్కూల్ వారు పిల్లలకు చిన్నతనం నుండే వైద్యులు చేసే సేవ, గొప్పతనం తెలియజేయడానికి వైద్య వృత్తిలో ఉన్న పలువురు తల్లిదండ్రులను, వారి సేవలకు గాను సత్కరించారు. ఈ సందర్బంగా నిర్వహించిన నాటిక , నృత్య ప్రదర్శన ఎంతో ఆకట్టుకున్నాయి.

అలాగే ఎప్పుడైనా, ఎక్కడైనా ట్రాపిక్ లో ఉన్నా అంబులెన్స్ కు దారి ఇవ్వాలనే నినాదంతో రూపొందించిన (Give away to Ambulance )అనే ఒక మహత్కర కార్యాన్ని వైద్యులచే ఆవిష్కరింపచేసారు. తరువాత వైద్యులు మాట్లాడుతూ Giving a way to the ambulance అనే అంశంపై చొరవ చూపించడం వల్ల ఆపదలో ఉన్న వారికి మేలుచేసేదిగా ఉంటుందని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు లిడియా క్రిస్టినా వైద్యల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ మేనేజర్, పాఠశాల కో-ఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here