మరోసారి ఆశీర్వదించండి

  • శేరిలింగంపల్లి డివిజన్ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రచారం

నమస్తే శేరిలింగంపల్లి : మరోసారి కారు గుర్తుకు ఓటేసి కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అభ్యర్థించారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని తారానగర్ మస్జీద్ ఈ హుస్సేనీ, లింగంపల్లి మెయిన్ రోడ్డు, మోతి మస్జిద్ల వద్ద చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించి ముస్లిం సోదరులకు స్థానిక నాయకులతో కలిసి కరపత్రాలను ఇచ్చి ప్రచారం చేపట్టారు.

ముస్తిం సోదరులకు పార్టీ కరపత్రాలు అందజేసి ప్రచారం చేపడుతున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

అనంతరం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here