- కాంగ్రెస్ ఫలాలు ప్రజలకు అందజేద్దాం
- శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : ప్రజాపాలనకు ఆకర్షితులై పలు పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి స్వచ్ఛందంగా చేరుతున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ వివేకానంద డివిజన్ అధ్యక్షులు బాషిపాక యాదగిరి ఆధ్వర్యంలో వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ కు చెందిన మాజీ కౌన్సిలర్ బాసారం రాజ్యలక్ష్మి, కృష్ణ మూర్తి సాగర్, సత్యనారాయణ చారి, కుమారస్వామి, ఆల్విన్ మల్లేష్, కుమారి, శివ కుమార్ పార్టీలో చేరారు.
కూకట్ పల్లి డివిజన్ గొట్టిముక్కల వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో దినబందు కాలనీ నాయకులు దత్తులూరి అశోక్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్నారు. వారిలో ( మల్లేష్, రవీందర్ చారి, నర్సింహ రావు, శ్రీనివాస్, రోహిత్, హరీష్ కుమార్, శివ దస్తగిరి, గోపాల్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, మణికంఠ, మధు, చంద్రం, నవీన్, శేఖర్, ప్రవీణ్ సాయి, జానీ, ఆకాష్, అక్షయ్, అమర్, సోను, మోసయ్య, అశోక్, కిరణ్, శ్రీనివాస్ చారి, ఫక్క్రుద్దీన్, వీరభద్రం, రాకేష్, గణేష్, స్వరూప్, వాసు, నవీన్ ) ఉన్నారు. ఈ సందర్భంగా వీరందరికీ శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదం బలంగా ఉందని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలు పేదలకు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. వివేకానందనగర్ కార్యక్రమంలో వెంకటస్వామి సాగర్,డాన్ వెంకట్, రాఘవులు, సురేఖ, భాగ్య లక్ష్మి…. కూకట్ పల్లి కార్యక్రమంలో నాయకులు నల్ల సంజీవ రెడ్డి, కృష్ణ ముదిరాజ్, శివ, పరుశురాం, మోహన్ రావు, ఆవుల రాజు, విష్ణు, ఘట్టం సునీల్, దశరథ్, రఘు, విట్ఠల్ పాల్గొన్నారు.