ఎంతో అభివృద్ధి చేశాం.. మళ్లీ అవకాశమివ్వండి

  • ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా 
  • ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
  • బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు
  • పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి :  చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ , వేముకుంట కాలనీలకి చెందిన  కాంగ్రెస్,  బిజెపి నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు,  కార్పొరేటర్  మంజుల రఘునాథ్ రెడ్డి  ఆధ్వర్యంలో పార్టీలో చేరిన పలువురికి  ప్రభుత్వ విప్  ఆరెకపూడి గాంధీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ  మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని, నిండు మనసు తో ఆశీర్వదించాలని కోరారు.  ముఖ్యమంత్రి  కేసీఆర్  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉరిటీ వెంకట్ రావు, ప్రవీణ్, వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్, గురు చరణ్ దుబే, అక్బర్ ఖాన్, చింత కింది రవీందర్, శ్రీకాంత్ రెడ్డి, గిరి, అంజద్ పాషా, యూసఫ్, సందీప్, అవినాష్, పద్మారావు పాల్గొన్నారు.

  • బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో

విజయ్ కుమార్, జగదీష్ ముదిరాజు,  సాయి కృష్ణ , ప్రసాద్, దుర్గ, ప్రణీత్, సంజీవ్, మహేష్, లక్ష్మణ్, భాషా, శివ కుమార్, రాణేశ్వర్, వర ప్రసాద్, వంశీ ప్రసాద్, ముజాహిద్, ప్రేమ్ కుమార్, శ్రీను, సుధీర్, రమేష్, యాది లాల్, బల్లు, రవి, కిరణ్, ప్రేమ్, చింటూ, నర్సింహ, వీరన్న, సుదర్శన్, ప్రశాంత్ ఉన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here