నాలుగేళ్ళ బాలుడు అదృశ్యం…సెల్లార్ గుంత ఖాళీ చేసినా…

మోక్ష (ఫైల్ ఫోటో)
  • ఇంటి వద్ద ఆడుకుంటూ బాలుడు అదృశ్యం
  • అనుమానంతో సెల్లార్ గుంతలో నీళ్లు తోడేసిన అధికారులు
  • నీళ్లు తొలగించినా ప్రయోజనం శూన్యం
  • కిడ్నాప్ చేసి ఉంటారని సందేహాలు
సెల్లార్ గుంతలో నీటిని తొడుతున్న సిబ్బంది

మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ చంద్రానాయక్ తండాకు చెందిన నాలుగు సంవత్సరాల బాలుడు కనిపించకుండా పోయాడు. ఇంటి పక్కనే నీటితో నిండిన గుంత లో ప్రమాదవశాత్తు పడి ఉంటాడనే అనుమానంతో జిహెచ్ఎంసి అధికారులు నీటిని తోడేసినా ఫలితం లేకపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు, బాలుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం… నల్గొండ ప్రాంతానికి చెందిన రాములు నాయక్ చంద్రానాయక్ తండాలో భార్య ముగ్గురు పిల్లలతో నివాసముంటున్నాడు. రాములు నాయక్ కుమారుడు మోక్ష(4) ఆదివారం మద్యాహ్నం ఇంటివద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. కాగా రాములు నాయక్ ఇంటి చుట్టూ ప్రక్కల తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించక పోవడంతో సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఘటన స్థలంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ వాహనం

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. కాగా బాలుడి ఇంటి ప్రక్కనే నీటితో నిండిన సెల్లార్ గుంతలో ప్రమాదవశాత్తూ పడి ఉండవచ్చనే అనుమానంతో జిహెచ్ఎంసి, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది నీటిని తోడే మోటార్ లతో సోమవారం ఉదయం నుండి సాయంత్రం 7 గం. వరకు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. కాగా 3 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో నివసించిన సూర్యాపేటకు చెందిన కిషన్ అనే వ్యక్తిని చూశామని స్థానికులు తెలపడంతో అతను కిడ్నాప్ చేసి ఉంటాడని తండ్రి మీడియా తో తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here