శేరిలింగంపల్లి బిజెపి అగ్రశ్రేణి నేత బొమ్మ కృష్ణమూర్తి మృతి

శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనత పార్టీ శేరిలింగంపల్లి అగ్రశ్రేణి నాయకుడు బొమ్మ కృష్ణమూర్తి మృతి చెందారు. 78 సంవత్సరాల వయస్సు గల బొమ్మ కృష్ణమూర్తి మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనత పార్టీ విస్తరణ కోసం సీనియర్ నాయకులు చిన్నం నర్సింహులు, గొల్లపల్లి కృష్ణరెడ్డి, ప్రకాష్ రెడ్డి తదితరులతో కలసి బొమ్మ కృష్ణమూర్తి విశేషంగా కృషి చేశారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక పదవులు చేపట్టిన బొమ్మ కృష్ణమూర్తి పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన మృతి భారతీయ జనతా పార్టీకి స్థానికంగా తీరని లోటు. నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు బొమ్మ కృష్ణమూర్తి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తారానగర్ లోని వారి గృహం నుంచి అంతిమయాత్ర మొదలై స్థానిక స్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

బొమ్మ కృష్ణమూర్తి (ఫైల్)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here