హఫీజ్‌పేట్(నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని సాయిరాం నగర్ కాలనీ వీది నెం 2 లో హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ శనివారం పాదయాత్ర చేశారు. కాలనీలో జీహెచ్ఎంసీ నిధులతో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుత హఫీజ్‌పేట్ డివిజన్ అభివృద్ధికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. సాయిరాం నగర్ లో ఇన్నాళ్లు యూజిడి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోఅవసరాలకు తగ్గట్టుగా భగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మిగతా ప్రాంతాల్లోనూ యూజీడీ పైపులైన్ పనులు చేసి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.