ఆరికెపూడికి హఠావో… శేరిలింగంపల్లికి బచావో..

  • గాంధీ ప్రవర్తనతో సొంత కార్పొరేటర్లే తిరుగుబహుట..
  • ఇక మిగిలింది ముగ్గురే
  • మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆపద్ధర్మ ఎమ్మెల్యే గాంధీ పై ప్రజల తిరుగుబాటుతో పాటు ఆయన ప్రవర్తనకు విసుకుచెంది సొంత కార్పొరేటర్లు కూడా అదే బాటలో పయనిస్తున్నారని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  9 మంది కార్పొరేటర్లకు సీట్లు రాకుండా చేసి వచ్చిన వారిని గెలవనియకుండా ప్రయత్నం చేసిన ఎమ్మెల్యేపై అదే పార్టీ కార్పొరేటర్ల తిరుగుబాటు దెబ్బకు కుదేలు అయిపోతున్నారని చెప్పారు.

చివరకు మిగిలేది ముగ్గురు మాత్రమేనని, ఇద్దరు బినామీ కార్పొరేటర్లు, ఒక బానిస కార్పొరేటరే అన్నారు. వారి డివిజన్లలో వారు చెప్తే ఓట్లు వేసే పరిస్థితి లేదని, చందానగర్ ఆడబిడ్డ ఉసురు తగిలి ఓటిమి ఖాయమైపోయిందని, ఇక మూడవ స్థానమే దిక్కని, శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలు ఆరికెపూడిని చిత్తు, చిత్తుగా ఓడించి అత్త గారింటికి పంపించాలని ఆతృతగా  ఎదురు చూస్తున్నారని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here