గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి గ్రామంలో స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి బిజెపి నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ తో కలిసి ఆదివారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గ్రామంలోని రంగనాథ స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న చెరువు, మెట్ల కుంట లేక్ పరిశుభ్రత కార్యక్రమం లో పాల్గొన్న రవికుమార్ యాదవ్, గంగాధర్‌రెడ్డిలు చెత్త చెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతీ పౌరుడు తన బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అపర్ణ సైబర్ కౌంటీ, అపర్ణ సరోవర్, డైమండ్ హైట్స్, గోపన్ పల్లి విలేజ్, గోపన్ పల్లి తండా బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
