- సొంత వ్యవసాయ భూమి కలను నెరేవర్చుతున్న ప్రైవేటు సంస్థలు
నమస్తే శేరిలింగంపల్లి: కొద్ది సంవత్సరాల క్రితం ఎకరాల కొద్ది వ్యవసాయ భూమి కలిగి ఉన్నా సమాజంలో పెద్దగా పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టేవి కాదు. మారుతున్న కాలంతో పాటే ప్రజల్లో వ్యవసాయ భూమి కలిగి ఉండాలనే కోరిక పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఎకరం వ్యవసాయ భూమినైనా కలిగి ఉండటం కూడా హోదాగా భావిస్తున్నారు. ఇక చిన్నదో పెద్దదో ఫామ్‌హౌజ్ ఉండటం కోటీశ్వరులకే తప్ప సామన్య ప్రజలకు అందని ద్రాక్షగానే మారింది. ఇటీవలి కాలంలో వ్యవసాయ భూముల ధరలు ఆకాశాన్నంటుతుండగా సామాన్య ప్రజలు ఎకరం భూమి కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రైవేటు సంస్థలు తక్కువ విస్తీర్ణంతో వ్యవసాయ భూమిని మార్కెటింగ్ చేస్తూ పేద ప్రజలకు సైతం అందుబాటు ధరల్లో కొద్దిపాటి వ్యవసాయ భూమిని అందించడమే కాకుండా పలు రకాల చెట్లను పెంచి కొనుగోలుదారుల పెట్టుబడికి తగిన లాభాలను చేకూర్చుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందుతోంది ఫామ్‌ల్యాండ్ కల్చర్. తక్కువ మొత్తంలో పెట్టుబడితో వ్యవసాయభూమితో పాటు, టేకు, గంధం, మలబారు వేప వంటి చెట్లతో భవిష్యత్తులో ఊహించని లాభాలను అందిస్తోంది.
ఈ తరహా ఫామ్‌ల్యాండ్ సేవలను అందిస్తున్న సంస్థల్లో నీమ్స్‌బోరో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్‌లో ఉన్న సంస్థలతో పోల్చితే అతి తక్కువ ధరలో 2.5, 5 గుంటల వ్యవసాయ భుమిని అందజేస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో జరుగుతున్న రెండు ప్రాజెక్టులు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయి.
రూ.3 లక్షలకే 605 చ.గజాల భూమి…
నీమ్స్ బోరో ఫామ్స్ ప్రాజెక్టుల్లో ఒకటైన ఫార్చున్ వుడ్స్ ప్రాజెక్టు 150 ఎకరాల్లో సిద్దమవుతోంది. హైదరాబాద్-నాందేడ్ జాతీయ రహదారి నుండి 5కి.మీ.ల దూరంలో, నారాయణఖేడ్ పట్టణం నుండి 20కి.మీ.ల దూరంలో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టులో 2.5 గుంటల భూమి ధర రూ.1,50,000గా, 5 గుంటల భూమి ధర రూ. 3 లక్షలుగా నిర్ణయించారు. ఒకేసారి చెల్లించలేని వారు 12 నెలల ఈఎంఐ ద్వారా కూడా భూమిని సొంతం చేసుకోవచ్చు. 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న సారెగమ క్లబ్ హౌస్ ప్రత్యేక ఆకర్షణ. మరెన్నో విశేషతలు కలిగిన ఈ ప్రాజెక్టులో పెట్టుబడుల ద్వారా అధిక మొత్తంలో లాభాలను పొందవచ్చని సంస్థ ప్రతినిధులు గ్యారంటీ ఇస్తున్నారు.
మరెన్నో ప్రత్యేకతలతో ఆక్సీరిడ్జ్ ఫామ్స్…
నారాయణఖేడ్ నుండి 3 కి.మీ. దూరంలో, జహీరాబాద్ నిమ్జ్ నుండి కేవలం 20 కి.మీల దూరంలో ఈ సంస్థ నిర్మిస్తున్న మరో ప్రాజెక్ట్ ఆక్సీరిడ్జ్ ఫామ్స్. ఫార్చున్‌వుడ్స్ ప్రాజెక్టును మించిన ప్రత్యేకతలతో ఏర్పాటవుతున్న ఈ ఫామ్‌లో 303 చ.గజాల భూమి రూ. 2.5లక్షలు, 605చ.గల భూమి ధర రూ.5లక్షలుగా నిర్ణయించారు. వ్యవసాయ క్షేత్రాల్లో పంటలో వాటా, డ్రిప్ ఇరిగేషన్, బోర్లు, ఫెన్సింగ్ వంటి సదుపాయాలతో పాటు క్లబ్‌హౌజ్‌లో ఉచిత సభ్యత్వాన్ని సైతం అందజేస్తున్నారు. ఈ ఫామ్ ల్యాండ్స్‌లో శాండల్‌వుడ్, మలబారు వేప, మహాగనీ వంటి వృక్షాలను పెంచి వాటి సంరక్షణ బాధ్యతను సైతం సంస్థ నిర్వహించేలా ఒప్పందంతో విక్రయించడం విశేషం. మరి ఇంకెందుకు ఆలస్యం కొద్దిపాటి పెట్టుబడితో సొంత వ్యవసాయభూమి కలిగి ఉండేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వివరాలకు సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ 9949665252, 8919732433 నెంబర్లలో సంప్రదించవచ్చు.