- శేరిలింగంపల్లి డివిజన్ సమీక్ష సమావేశంలో పార్లమెంట్ ఇన్చార్జి మల్లారెడ్డి, శేరిలింగంపల్లి బీజేపీ ఇన్ చార్జి రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంటు గడ్డపై కాషాయం జెండా ఎగరాలంటే బూత్ స్థాయి నుండి కమిటీలు ఏర్పరచుకొని కష్టపడి పనిచేయాలని పార్లమెంట్ ఇన్చార్జి మల్లారెడ్డి, శేరిలింగంపల్లి బీజేపీ ఇన్ చార్జి రవికుమార్ యాదవ్ తెలిపారు. ప్రతి బూతుకి 30 మందిని నియమించి ప్రతీ బూతులో 350 నుంచి 370 వరకు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కష్టపడి పని చేయాలని, అప్పుడే భారతీయ జనతా పార్టీ గెలుపు సాధించి మరొకసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని మసీదు బండ కొండాపూర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో అనితారెడ్డి, కన్వీనర్ రాఘవేంద్రరావు, డాక్టర్ నరేష్, మనీ భూషణ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ కార్యకర్తల, నాయకుల మధ్య మనస్పర్ధలు పక్కన పెట్టి మనమంతా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులలాగా కలిసిమెలిసి పని చేసినట్లయితే సులువుగా విజయం సాధించవచ్చునని తెలుపుతూ ప్రతి డివిజన్లో బూత్ కమిటీలు ఏర్పరచుకొని ప్రచారంలో ముందుకు సాగాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. కార్యక్రమంలో ఎల్లేష్, రాజు శెట్టి, రమేష్, నరసింహ, శ్రీనివాస్, రాజేష్, విజయలక్ష్మి, భరత్, అరుణ్, జ్యోతి పాల్గొన్నారు.