నమస్తే శేరిలింగంపల్లి : రంజాన్ మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని మాదాపూర్ డివిజన్ పరిధి ఆదిత్య నగర్ లోని సెయింట్ ఐజాక్ అడ్వెంట్ హై స్కూల్ ప్రాంగణంలో దవాత్- ఏ – ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనదని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సెయింట్ ఐజాక్ అడ్వెంట్ హై స్కూల్ చైర్మన్ కమర్ జహన్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాంబశివరావు, ప్రవీణ్, ఖాసీం బాయ్, యకత్ బాయ్, బాబు మియా, ఎండీ గౌస్, మహ్మద్ అమీర్, సలీమ్ ,కాజా, ఇమ్రాన్ ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.