- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
- బిజెపిలో చేరిన గోపినగర్ కాలనీ వాసులు..సాదరంగా ఆహ్వానం
నమస్తే శేరిలింగంపల్లి: స్థానిక నియోజకవర్గంలోని అన్ని కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ లైన్లు, మంజీరా పైప్ లైన్, ఇండ్ల పట్టాలు, ఇళ్లు మంజూరు, స్కూల్స్ నిర్మాణం, పార్క్లు ఏర్పాటు, ప్రభుత్వ భూములు కబ్జాలు కాకుండా కాపాడింది, ప్రతి బస్తి, ప్రతి కాలనీ అభివృద్ధి చేసింది, పేదవారికి రేషన్ కార్డులు , వృద్ధాప్య పింఛన్లు మంజూరు ఇలా ఎన్నో పనులు చేసింది బిక్షపతి యాదవ్ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ గుర్తుజేశారు.
లింగంపల్లి డివిజన్, గోపి నగర్ కాలనీ నుంచి గుణశేఖర్ ఆధ్వర్యంలో యువకులు, కాలనీ వాసులు బి.ఆర్.ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి బిజెపిలో చేరగా…వారికి పార్టీ కండువా కప్పి సాధారఁగా ఆహ్వానించారు. ప్రభుత్వానికి రాష్ట్రం లో అత్యధిక ఆదాయం హైదరాబాద్ నుండి వస్తే హైదరాబాద్ కు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి 40 శాతం వస్తుందని, అలాంటి నియోజకవర్గానికి మౌలిక సదుపాయాల కల్పన, కాలనీలు బస్తీల అభివృద్ధి గురించి , ఎమ్మెల్యే ఏరోజైన ప్రభుత్వంతో కొట్లాడి పనులు తీసుకొచ్చారా , యువత ఉద్యోగాల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. పార్టీలో చేరిన వారిలో నరేష్ , నాని, రాజేందర్, కుట్టి, రూబీన్, రామచందర్, జయమ్మ, సంగీత, రాము ఉన్నారు.