నమస్తే శేరిలింగంపల్లి : సంక్రాంతి పండుగ సందర్భంగా భవానీ పురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వేసిన రంగు రంగుల రంగవల్లికలు ఆకట్టుకున్నాయి. భవిష్యత్తు తరాలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేలా పోటీలు నిర్వహించి వాటి విశిష్టతను తెలియజేస్తున్నట్లు భవానీ పురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది.

అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రతి మహిళకు ఒక అందమైన మొక్కని బహూకరించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.






