నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఉన్న ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపేవిధంగా కృషి చేస్తానని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే పరిపాలన వ్యవస్థ పూర్తిగా మార్చి ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ముందుకు సాగుతుందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.
చందానగర్ డివిజన్ పరిధిలోని భవానిపురం కాలనీలో పర్యటించి స్థానికంగా ఉన్న నాలా, అండర్ గ్రౌండ్ డ్రైనేజి సమస్యలను పరిశీలించారు.అనంతరం కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి కాలనీ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్దినేటర్ రఘునందన్ రెడ్డి, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి, నల్ల సంజీవ రెడ్డి, వీరేందర్ గౌడ్, కాలనీ అధ్యక్షులు సుందర్, గౌస్, కృష్ణ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, పర్వత రెడ్డి, ప్రేమ్ కుమార్, కిరణ్ బాబు, కృష్ణంరాజు, రంగయ్య, వీరా రెడ్డి, రాఘవులు, ఈశ్వర్ రెడ్డి, హేమాద్రి, కాలనీ మహిళలు పాల్గొన్నారు.