- సంబురంగా బతుకమ్మ, సాంస్కృతిక కార్యక్రమాలు
నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో అల్ ఇండియా సారీ మేళ, బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్బంగా చేనేత చీరలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. శిల్పారామం మహిళా సిబ్బంది , సందర్శకులు బతుకమ్మ ఆటలు సందడి చేశాయి. సందర్శకులు, స్టాల్ ఆర్టిసన్స్, దాండియా ఆటలో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలలో రేణుక ప్రభాకర్ శిష్య బృందం “దక్ష యజ్ఞ , అష్టాదశ శక్తి పీఠాలు ” నృత్య రూపకం ఎంతగానో ఆకట్టుకుంది. అర్చన మిశ్ర , సోనాల్ బాసర్కార్ శిష్య బృందం గణేశా వందన, గురు వందన, నృత్య సంగీత్, తరణ, దేవి స్తుతి అంశాలు అర్చన మిశ్ర,అర్చన మిశ్ర , శ్రేయ సుమన్, లక్షిత, దేవంశీ, నటాషా, స్వాతి, పద్మరని, మిరయా, పలు అంశాలలో నర్తించి మెప్పించారు.