నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో జరుగుతున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ నేటితో ముగిసింది. చేనేత హస్తకళా ఉత్పత్తులు సరసమైన ధరలో సందర్శకులు కొనుగోలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మంగళ, రాఘవరాజ్ భట్ శిష్య బృందం చే కథక్ నృత్య ప్రదర్శన, స్మిత మాధవ్ శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. సంవత్సరం చివరి రోజు కావడం వల్ల సందర్శకులు అధిక సంఖ్యలో పాల్గొని చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేశారు.







