మంజీరా తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో హెచ్ఎండబ్ల్యూఎస్ & ఎస్ బి ఆధ్వర్యంలో రూ. 30 లక్షల అంచనావ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన మంజీరా తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం ద్వారా కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని ఇవ్వడం తో పాటు పవర్ బోర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం రాజశేఖర్, డిజిఎం నాగప్రియ, మేనేజర్ పూర్ణేశ్వరి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ ఎస్ నాయకులు సాంబశివరావు, బ్రిక్ శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్, పితాని లక్ష్మీ, సంజీవ రెడ్డి, శివాజీ సయ్యద్ గౌస్, దుర్గ రావు, పితాని శ్రీనివాస్, వీర రెడ్డి, రాబిన్ గౌడ్, రాజు యాదవ్, వర్మ, శరత్, ప్రసాద్, వెంకటేశ్వరరావు, భూషణం, వెంకట్ రావు, పుష్ప కాలనీ వాసులు పాల్గొన్నారు.

గోకుల్ ప్లాట్స్ కాలనీలో హెచ్ఎండబ్ల్యూఎస్ & ఎస్ బి ఆధ్వర్యంలో మంజీరా తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here