నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ నగరంలోని దేవిగ్రాండ్ హోటల్ లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం ఎఐఎవైఎస్ గ్రేటర్ హైదరాబాద్ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ పూర్తి కమిటీని 34మందితో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కర్క నాగరాజు నియమించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గంగారాంకు చెందిన కంది సాయికుమార్ ను ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించగా.. ఆయనకు ఎఐఎవైఎస్ జాతీయ కోఆర్డినేటర్ ఎస్. వరుణ్ కుమార్, హైకోర్టు సీనియర్ న్యాయవాది బాలత్రిపుర సుందరిలు నియామకపత్రాన్ని అందజేశారు.
అనంతరం కంది సాయి మాట్లాడుతూ డివిజన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న తనను గ్రేటర్ హైదరాబాద్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా నియమించిన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కర్కనాగరాజు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను నెరవేర్చేలా కృషి చేస్తాన్నని తెలిపారు. అంబేద్కర్ సంగం ద్వారా దళితుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ వారి సమస్యల పరిష్కారానికై కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం ప్రభాకర్, ప్రముఖ అంబేద్కరైట్ బి. న్.రత్న, అంబేద్కర్ సంగం రాష్ట్ర అధ్యక్షులు కే. వినయ్ కుమార్, దళిత రాష్ట్ర నాయకులు కర్క పెంటయ్య, బేగరి రాజు, రవీందర్, డాకయ్య, ప్రమోద్, మంజుల, శశికల, సదామహేష్, వెంకన్న డాన్, విద్యాసాగర్, ప్రీతం, శ్రీనివాసరావు, ప్రేంకుమార్ పాల్గొన్నారు.