నమస్తే శేరిలింగంపల్లి: రెండవసారి కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగంనాగేందర్ యాదవ్ ను ఆదర్శ్ నగర్ కాలనీ వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో కాలనీ కమిటీ సభ్యులతో కలిసి రాగం నాగేందర్ యాదవ్ ను సన్మానించిన కాలనీవాసులు తమ సమస్యలను వివరించారు. స్పందించిన కార్పొరేటర్ రాగం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమదాసు, మూజుల్, ఆమీన్, జి.వి.రావు, శివరామకృష్ణన్, మురళీ కృష్ణ, బాలన్న,శంకర్, పాలం శ్రీనివాస్, కొవ్వూరి అశోక్ యాదవ్, వై.హెచ్.మోహన్ రావు, మహిళలు బిన్నీ, లక్ష్మి నాయుడు తదితరులు పాల్గొన్నారు

ఆదర్శ్‌నగర్ కాలనీవాసులతో కార్పొరేటర్ రాగంనాగేందర్ యాదవ్
బాపునగర్‌లో పర్యటించిన కార్పొరేటర్ రాగం…
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర్ కాలనీలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గురువారం పర్యటించారు. డ్రైనేజీ వ్యవస్థ పైన స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాలనీలో పర్యటించిన ఆయన అధికారులతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమదాసు, గణపురం రవీందర్, రాజ్ కుమార్, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
